మూగజీవాలు కొద్దిరోజులుగా వ్యాధులతో మృత్యువాత పడుతుండగా.. గొర్రెలు, మేకలు పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం వెంకటరాజుపురంలో 15 రోజుల వ్యవధిలో 68 గొర్రెలు, మేకలు.. వ్యాధులతో మృతి చెందాయని బాధితులు చెబుతున్నారు. పశు వైద్యులు కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి.. మృతి చెందిన మూగజీవాలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. వ్యాధులు సోకిన జంతువులకు వైద్యం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కొన్ని యాదవ కుటుంబాలు.. గొర్రెలు, మేకలు పెంపకంతోనే తరతరాలుగా గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. గోకాడ గంగునాయుడుకి చెందిన రూ.4 లక్షల విలువైన గొర్రెలన్నీ మృతి చెందాయి. ఉపాధి కోల్పోయిన ఆ కుటుంబం.. ఊరి విడిచి వెళ్లిపోయింది. సీముసురు రాములకు చెందిన 22 గొర్రెలు, మేకలు ఇదే తరహాలో మరణించాయి. సమస్యను పరిశీలించిన సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకన్న.. వైద్యులు నిర్లక్ష్యంతోనే జీవాలు చనిపోయాయన్నారు. వాటి పెంపకందారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: