రాయితీ ఉల్లి కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని... ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. విశాఖలోని అక్కయ్యపాలెం నరసింహానగర్ రైతుబజార్ వద్ద రాయితీ ఉల్లి కౌంటర్లను ఆయన పరిశీలించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యూలో వేచిఉన్న మహిళలతో ఆయన మాట్లాడారు. పౌరసరఫరాల శాఖ దుకాణాల ద్వారా లేదా వార్డు వలంటీర్ల ద్వారా ఉల్లి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారని... ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తామని గంటా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: