విశాఖ ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 300 కిలోల గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో మన్యం మారుమూల ప్రాంతమైన కిముడుపల్లిలో రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 15 లక్షలు ఉంటుందని అంచనా. గంజాయి, నాటుసారా కేసుల్లో శిక్షలు కఠినంగా అమలు అవుతాయని అధికారులు హెచ్చరించారు.
ఇవీ చదవండి...విశాఖ ఆస్పత్రి నుంచి డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్