పాయకరావుపేటలో గంజాయి పట్టివేత విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట తాండవ నది కూడలి వద్ద 195 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కారులో చింతపల్లి మండలం గాదిగోయి నుంచి తమిళనాడుకు గంజాయిని తరలిస్తున్నారనే... ముందస్తు సమాచారంతో వాహనాల తనిఖీలు చేసినట్లు ఎస్సై భూషణరావు పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 2 లక్షలకు పైగా ఉంటుందని ఆయన వెల్లడించారు. కారును స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇవీ చూడండి-ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం