రోలుగుంట మండలం ఎంకే పట్నం శివారు పెద్దపేట కూడలి వద్ద కారులో తరలిస్తున్న 30 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విలువ రూ. 2.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ దాడిలో రోలుగుంటు మండలం రత్నంపేట గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. వీరి వద్ద నుంచి సెల్ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: