ETV Bharat / state

1,174 ఎకరాల్లో.. రూ. 4 కోట్ల విలువైన గంజాయి సాగు ధ్వంసం - గంజాయి సాగు ధ్వంసం చేసిన పోలీసులు

ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని మారుమూల అడవుల్లో గిరిజనులు సాగుచేస్తున్న గంజాయి తోటలను పోలీసులు, ఆబ్కారీ శాఖ సిబ్బంది ధ్వంసం చేశారు. దాదాపు నాలుగు కోట్ల రూపాయలు విలువైన గంజాయిని కాల్చేశామని వారు తెలిపారు.

janja plantations destroying by police in andhra orissa border forest areas
గంజాయి సాగు ధ్వంసం
author img

By

Published : Jan 20, 2021, 3:08 AM IST

గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఒడిశా పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న గంజాయి సాగు పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సరిహద్దులోని మాచ్​ఖండ్​ సమీపంలోని జయంతిగిరి అటవీ ప్రాంతంలో ఆబ్కారీ శాఖ సిబ్బంది కలసి పోలీసులు దాడులు నిర్వహించారు. నందపూర్ ఎస్డీపీఓ సంజయ్ మహపాత్రో నేతృత్వంలో 40 ఎకరాల్లో గంజాయి మొక్కలను ధ్వసం చేశారు.

గిరిజనులు అత్యంత మారుమూల అటవీ ప్రదేశాల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తుండడంతో.. పూర్తి కట్టుదిట్టమైన భద్రత మధ్య గంజాయి సాగు ధ్వంసం కార్యక్రమం కొనసాగింది. లమతపుట్, నందపూర్ మండలాల్లో ఇప్పటివరకు 9 చోట్ల 1174 ఎకరాల్లో గంజాయి సాగును కాల్చివేసి నట్టు పోలీసులు తెలిపారు. ఇవాళ ఒక్కరోజే దాదాపు రూ. 4 కోట్ల విలువ చేసే గంజాయిని కాల్చేశామన్నారు.

ఇదీ చదవండి:

'భూ ఆక్రమాలకు పాల్పడకపోతే..బాబా ఆలయంలో ప్రమాణం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.