ETV Bharat / state

Drugs: ఆ వెబ్‌సైట్స్ ద్వారా డ్రగ్స్ విక్రయం.. ఐదుగురు అరెస్టు - డ్రగ్స్ తాజా వార్తలు

Gang selling drugs: స్నేహితుల దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఇన్​స్ట్రాగామ్ ద్వారా గ్రూపులను ఏర్పాటు చేసుకోని డార్క్ వెబ్​సైట్స్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ వెల్లడించారు. డ్రగ్స్ కొనుగోలుకు క్రిప్టో కరెన్సీ, యూపీఐ పేమెంట్స్ వినియోగిస్తున్నట్లు తెలిపారు.

డార్క్ వెబ్‌సైట్స్ ద్వారా డ్రగ్స్ విక్రయం

author img

By

Published : Aug 7, 2022, 3:31 PM IST

Drugs in Vishaka: విశాఖలో డ్రగ్స్ కలకలం రేపాయి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా నగరంలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏజెన్సీతోపాటు నగరానికి చెందిన రవికుమార్, వాసుదేవ కాటయ్య, మోజేశ్, యాడ కిషోర్, బెంగళూరుకు చెందిన మర్రే సందీప్ అనే యువకులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 50 ఎల్​ఎస్​డీ బ్లాట్స్, 4.4 గ్రాముల ఎండీఎంఏ పౌడర్, ఐదు సెల్​ఫోన్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు నగర కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. మరో నిందితుడు దీలిప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉందని వివరించారు.

నగర కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. కేసులో ప్రధాన నిందితుడు పాంగి రవికుమార్ ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకెళ్లి గోవాలో దిలీప్​కు అందజేసేవాడు. దిలీప్ గంజాయికి బదులుగా.. డ్రగ్స్​ను రవికుమార్​కు ఇచ్చేవాడు. వాటిని విశాఖకు తీసుకొచ్చి స్థానిక యువతకు రవి అమ్ముతున్నట్లుగా గుర్తించామన్నారు. సామాజిక మధ్యమాలైన వాట్సాప్, ఇన్​స్ట్రాగామ్ ద్వారా గ్రూపులను ఏర్పాటు చేసుకోని డార్క్ వెబ్​సైట్స్ ద్వారా విక్రయిస్తున్నట్లు సీపీ తెలిపారు. వీటి కొనుగోలుకు క్రిప్టో కరెన్సీ, యూపీఐ పేమెంట్స్ వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. డ్రగ్స్ అమ్ముతున్న, అలవాటున్న వారందరిపైనా యాంటీ నార్కోటిక్ సెల్ ద్వారా ప్రత్యేక నిఘా ఉంచామని సీపీ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.