ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం (పాలవెల్లి) మధ్య తరహా జలాశయం ప్రాంతంలో దట్టంగా తుప్పలు పెరిగిపోయాయి. జలాశయం ప్రధాన గట్టుతో పాటు జనరేటర్ గది, విశ్రాంతి భవనం ప్రాంతాల్లో వ్యాపించాయు.
వీటితో జలాశయం స్వరూపమే మారిపోయింది. ఆ ప్రాంతమంతా అధ్వానంగా మారిన వైనంపై గతనెల 28న ఈటీవీ భారత్లో కథనం వచ్చింది. జలవనరుల శాఖ అధికారులు స్పందించి తుప్పలు తొలగించారు. రైతులు, సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: