విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో అయ్యప్ప స్వామి దేవస్థానం వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా భక్తులతో కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని అయ్యన్న ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: ఉప ముఖ్యమంత్రి ధర్మాన