ETV Bharat / state

వంజంగిలో పర్యాటకుల రద్దీ.. నిలిచిపోయిన ట్రాఫిక్!

విశాఖ జిల్లాలోని వంజంగిలో పర్యాటకుల రద్దీ పెరిగింది. సెలవు రోజులు కావడంతో.. జనాలందరూ మేఘాల కొండను చూసేందుకు తరలివస్తున్నారు. పర్యాటకులు ఎక్కువవడంతో... 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

full-of-tourists-at-vanjangi-in-vishaka-district
వంజంగిలో పర్యాటకుల రద్దీ.. నిలిచిపోయిన ట్రాఫిక్!
author img

By

Published : Jan 9, 2022, 9:33 AM IST

విశాఖ పాడేరు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి పర్యాటకులతో కిటకిటలాడుతోంది. సెలవు రోజులు వంజంగి కొండల సందర్శనకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. వంజంగి మేఘాల కొండను చూసేందుకు వచ్చిన జనాలతో... ఘాట్​రోడ్​లో 3 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఓ టూరిస్టు బస్సు వెనుక చక్రం గోతిలో పడి.. రోడ్డుకు అడ్డంగా ఇరుక్కుపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో... ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వంజంగి కొండ కింద నేటి నుంచి టోల్‌ రుసుము వసూలు చేయనున్నారు.

ఇదీ చూడండి: పండక్కి ఊరెళ్తున్నారా..? ఇళ్లు గుల్లవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.