విశాఖ జిల్లా కశింకోట మండలంలోని చింతలపాలెం గ్రామంలో ఇంటింటికీ బత్తాయి పండ్లు పంపిణీ చేశారు. గ్రామంలోని వృద్ధురాలికి కరోనా సోకిన కారణంగా.. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు. ప్రజలకు పోషకాహారం అందాలన్న లక్ష్యంతో.. వైకాపా నాయకులు మళ్ళ బుల్లిబాబు ఆర్థిక సాయంతో ఇంటింటికీ బత్తాయి పండ్లను పంచారు.
అనకాపల్లి ఢీఎస్పీ శ్రావణి చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని ప్రచారం చేశారు. లాక్ డౌన్ ఆంక్షలు పాటించాలని కోరారు.
ఇవీ చూడండి: