చిన్నప్పటినుంచి హైస్కూలు తరగతి దాకా ఆ స్నేహితులందరూ కలిసే చదువుకున్నారు. ఏమైందో ఏమో..ఆ గ్యాంగ్‌లోని ఓ స్నేహితుడు మరణించడంతో...మిగిలినవారూ కుటుంబానికి అండగా నిలిచారు. విశాఖ జిల్లా కె.కోటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994-95 సంవత్సరం పదోతరగతి విద్యార్థుల ఓ బృందం..అందరికి సహాయం చేస్తుండేది. ఆ గ్యాంగ్‌లోని ఓ స్నేహితుడు ఉబ్బనశెట్టి వెంకటరావు ఇటీవల మరణించాడు. మిగతా స్నేహితులందరూ కలిసి రూ.60 వేల రూపాయలను..మిత్రుని కుటుంబానికి అందజేశారు.
ఇదీ చూడండి.: డా.అనితా రాణి పిటిషన్‌పై విచారణ: కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి ఆదేశం