ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మారుమూల గ్రామాలకు విశాఖ జిల్లా పోలీసులు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. ఏవోబీలోని బలపం పంచాయతీ, ఆ చుట్టుపక్కల గ్రామాల గిరిజనుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్సును ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. మన్యంలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు సరైన రహదారి, రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని బలపం పంచాయతీ పరిధిలోని 33 గ్రామాలతో పాటు ఒడిశా ప్రజలకు సౌకర్యవంతగా ఉంటుందని బస్సు సర్వీసు ప్రారంభించామన్నారు.
ఈ సర్వీసు అన్నవరం నుండి కోరుకొండ వరకు ప్రతిరోజు మూడు సార్లు ఉచితంగా నడపబడుతుందని ఏఎస్పీ తెలిపారు. బస్సు సర్వీసును గిరిజనలు సద్వినియోగం చేసుకొని సురక్షితమైన ప్రయాణానికి నాంది పలకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్ఎస్.నాయుడు, చింతపల్లి సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి