ETV Bharat / state

accident: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా వన్నెపూడి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోగా.. విశాఖ జిల్లాలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు.

road accidents
డ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
author img

By

Published : Aug 4, 2021, 3:22 AM IST

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కచెల్లెళ్లు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నర్సీపట్నం మండలం పెడబొడ్డేపల్లికి చెందిన పిల్లి రాజబాబు- దుర్గా కామేశ్వరి దంపతులు.. కామేశ్వరి సోదరి పావని, ఆరు నెలల చిన్నారితో కలిసి తుని తలుపులమ్మ దర్శనానికి స్కూటీపై వెళ్లివస్తున్నారు. ఈ క్రమంలో ఉద్దండపురం వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడ్డారు. అటుగా వెళ్తున్న వ్యాన్​.. కామేశ్వరి, పావనిలపై నుంచి వెళ్లడంతో ఆ ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. రాజబాబుకు తీవ్ర గాయాలు కాగా.. చంటి బిడ్డ స్వల్ప గాయాలతో బయటపడింది. పావని భర్త సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేకరు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెంకన్న వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లాలో డివైడర్​ను​ డీకొట్టి ఇద్దరు..

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వాళ్లు ప్రయాణిస్తున్న బైకు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటన స్టలానికి చేరుకొన్న సీఐ రామకృష్ణ శ్రీనివాస్.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మృతులు ఏలేశ్వరం గ్రామానికీ చెందిన వెంకట రమణ(శివ), మాధవ్​గా గుర్తించిన పోలీసులు... మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానిక తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

ఇదీ చదవండి..

CHILD KIDNAP: 4 నెలల పసికందు అపహరణ...కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.