విశాఖ మన్యంనుంచి కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీరంతా... విశాఖ జిల్లా ఘాట్ రోడ్డు కూడలి వద్ద పోలీలకు చిక్కారు.
నిందితుల నుంచి 31 కేజీల గంజాయి, కారు, ల్యాప్ టాప్, 2 వేల నగదు, 4 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండుకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
కేజీహెచ్‌లో 'కోవీ షీల్డ్ వ్యాక్సిన్' మూడో దశ ట్రయల్స్ ప్రారంభం