ETV Bharat / state

రెమిడెసివిర్ అక్రమ విక్రయం కేసులో నలుగురు అరెస్ట్ - రెమిడెసివిర్ అక్రమ విక్రయం కేసులో నలుగురు అరెస్ట్

రెమిడెసివిర్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయం కేసులో విశాఖ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన వివరాలను ఏసీపీ హర్షిత వివరించారు.

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ హర్షిత
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ హర్షిత
author img

By

Published : Apr 21, 2021, 6:32 PM IST

Updated : Apr 21, 2021, 10:55 PM IST

విశాఖ ఓమ్ని ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు ఇవ్వాల్సిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లను దొంగిలించి అక్రమంగా విక్రయించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఈ నెల 19న ఓమ్ని ఆసుపత్రి సిబ్బంది రెమిడెసివిర్ ఇంజెక్షన్లను అక్రమంగా అమ్ముతుండగా విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడి చేసి వారిని పట్టుకున్నారు. అనంతరం అక్రమ అమ్మకంలో భాగస్వాములు అయిన వారిని గుర్తించి విశాఖ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ హర్షిత

ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ మేనేజర్ గా పని చేస్తున్న సర్వేశ్వరరావు గత నెలలో కొవిడ్ బారిన పడిన సమయంలో కొనుగోలు చేసిన రెమిడెసివిర్ ఇంజెక్షన్లు మిగిలి పోవడంతో వాటిని ఎక్కువ ధరకు అవసరమైన వారికి విక్రయించాడు. ఆ అనుభవంతో రెమిడెసివిర్​కు ఉన్న డిమాండ్ సొమ్ము చేసుకోవాలని భావించి రోగులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లపై కన్నేశాడు. ఇంకో ఉద్యోగి వెంకటరావు, ఇద్దరు స్టాఫ్ నర్సులతో కలిసి రోగులకు ఇవ్వాల్సిన రెండు ఇంజెక్షన్లను దొంగిలించారు. ఈ ఇంజెక్షన్లను సర్వేశ్వరరావు అధిక ధరకు విక్రయించాడు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారుల చేతికి చిక్కారు. ఈ కేసులో నిందితులు నలుగురిని అరెస్టు చేసి ఒక రెమిడెసివిర్ ఇంజెక్షన్ స్వాధీనపరుచుకున్నట్లు విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత వెల్లడించారు.

ఇదీ చదవండి:

'రెమ్​డెసివిర్​' బ్లాక్​లో విక్రయం..పలువురు అరెస్ట్​

బంగాల్ దంగల్​: ఆరో విడతలో 43స్థానాలకు పోలింగ్​

Last Updated : Apr 21, 2021, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.