అమరావతి రాజధాని నిర్మాణం కోసం దళిత వర్గాల అసైన్మెంట్ భూమి సేకరణలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో విలేకర్లతో మాట్లాడారు. రైతుల నుంచి భూముల సేకరణ విషయంలో అక్రమాలు, అవినీతి జరగకుండా ఉండేందుకు సీఆర్డీఏ చట్టం సెక్షన్-146 చేర్చారన్నారు.
సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీ అధికారిగా నియమించిన సాంబశివరావు... అవినీతికి అంగీకరించకపోవడంతో ఆయనను తొలగించారని ఆక్షేపించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమన్నారు. అలాగే.. మార్చి నెలాఖరులోగా పరిషత్ ఎన్నికలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎన్నికల కమిషనర్‌కు రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
ఈనెల 24న నామినేషన్ దాఖలు చేస్తా: తిరుపతి తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి