పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సందేశాన్నిస్తూ.. ఓ నవజంట వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగ రీత్యా జపాన్‌లో ఉంటున్న విశాఖకు చెందిన చైతన్య కృష్ణ, పశ్చిమబంగా యువతిని వివాహం చేసుకోనున్నారు. విశాఖలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలకు వచ్చిన పర్యటకులు... ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయటం పెద్ద సమస్యగా మారింది. దానిని ప్రజలకు తెలియజేసేలా ఈ జంట ఓ కార్యక్రమం చేపట్టారు. వివాహ వేడుకకు జపాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి వచ్చిన తమ స్నేహితులతో కలిసి అక్కడున్న వ్యర్థాలను తొలగించారు. స్వచ్ఛ భారత్ లక్ష్యం దిశగా ప్రజల్లో మరింత అవగాహన రావాలన్నారు.
ఇవీ చదవండి..