ఇదీ చూడండి:
విశాఖలో ప్రైవేట్ రంగ ఏజెన్సీల జాతీయ సదస్సు - private agencies national seminar
ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పిస్తోన్న ఏజెన్సీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేలా విశాఖలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ అధికారులు, పలు ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు తమ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ఎఫ్ఎంఏఐ ప్రతినిధులు సూచించారు.
విశాఖలో ప్రైవేట్ రంగ ఏజెన్సీల జాతీయ సదస్సు
సాగర తీరం విశాఖలో.. ప్రైవేటు రంగంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోన్న ప్రైవేట్ ఏజెన్సీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేలా ఫెసిలిటీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సదస్సు నిర్వహించింది. ఫెసిలిటీ ఇన్ న్యూ డైమెన్షన్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అధికారులు, ప్రావిడెంట్ ఫండ్ అధికారులు, పలు ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ తమ వద్ద పని చేస్తోన్న కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ఎఫ్ఎం ఏఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అప్సర్ హుస్సేన్ తెలిపారు. ఈ సదస్సుకు అవైల్ ఫైనాన్స్ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తోన్న కార్మికులందరికీ 10 నుంచి 40 వేల వరకూ రుణ సదుపాయం కల్పించనున్నట్లు అవైల్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఉన్న పీఎఫ్, ఈ ఎస్ఐ, జీఎస్టీ వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:
Intro:Body:Conclusion: