వాయుగుండం ప్రభావంతో విశాఖ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో రూ.77.64 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కలెక్టరేట్‌కు మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. అవి వస్తే నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు యంత్రాంగం నివేదిక సిద్ధం చేసింది. మృతి చెందిన ఐదుగురికి నిబంధనల ప్రకారం రూ.4లక్షల చొప్పున పరిహారం అందనుంది. రహదారులు భవనాల శాఖకు 157 .5 కిలోమీటర్లు రోడ్డు నష్టం జరుగగా వీటి మరమ్మతుకు రూ. 62.2 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
జిల్లాలో 61 ఇళ్లు పాక్షికంగా, 9 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటలకు రూ.4.34 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
వ్యవసాయ శాఖ పరంగా 4.34 కోట్లు నష్టం రాగా, ఉద్యాన వన పంటలకు 8 లక్షలు, ఆహారధాన్యం పంటలు 4.24 కోట్లు నష్టం వచ్చింది. 19 మండలాల పరిధిలోని 150 గ్రామాలకు చెందిన 7,771 మంది రైతులకు చెందిన పంటలు నీట మునిగాయి. విశాఖమహానగర పాలక సంస్థ 5 .12 కోట్లు, ఈపీడీసీఎల్ కు 4 .71 కోట్లు నష్టం వాటిలినట్టు అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నివేదిక గా పంపారు.
ఇదీ చదవండి: తీవ్రవాయుగుండం.. ఉభయగోదావరి జిల్లాలకు గండం!