రెండు వేర్వేరు చోరీ కేసుల్లో.. ఐదుగురు మైనర్లతో పాటు మరో 19 ఏళ్ల ప్రధాన నిందితుడు నెక్కల నారాయణరావును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్లో పనిచేసే వ్యక్తి నుంచి.. రూ. 40 వేలు చోరీ అయిన కేసును ఛేదించారు. బాధితుడు పని మగించుకుని ఇంటికి వెళ్తుండగా.. ప్రణాళిక ప్రకారం అతడి వద్ద నగదును దోచేశారని డీసీపీ సురేష్ బాబు పేర్కొన్నారు.
నారాయణరావు పన్నిన వ్యూహం మేరకు.. నలుగురు మైనర్లు 2 ఖరీదైన బైక్‌లపై వెనుక నుంచి బాధితుడిపై దాడి చేసి నగదు లాక్కున్నట్లు డీసీపీ వెల్లడించారు. అతడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను గుర్తించారని చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 35 వేలతో పాటు రెండు ద్విచక్రవాహనాలు, కొంత వైరును స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో ఏటీఎంను పగులగొట్టేందుకు యత్నించిన మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:
'తెదేపా అండగా ఉంటుంది.. ప్రాణత్యాగాలు చేసుకునే నిర్ణయాలు వద్దు'