ETV Bharat / state

ఐదు పూరిళ్లు దగ్ధం.. నిరాశ్రయులైన గిరిజనులు - పూరిళ్లు దగ్ధం తాజా వార్తలు

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. గూడులేని ఆ నిరుపేద గిరిజనుల ఇళ్లు బూడిదపాలైన కారణంగా.. వారంతా రోడ్డున పడ్డారు. విశాఖ జిల్లా నాతవరం మండలం సుందర కోట పంచాయతీ శివారు అసనగిరిలో ఈ ఘటన జరిగింది.

fire accident five houses burnt
ఐదు పూరిళ్లు దగ్ధం
author img

By

Published : Mar 25, 2021, 7:55 PM IST

విశాఖ జిల్లా నాతవరం మండలం సుందర కోట పంచాయతీ శివారు అసనగిరిలో ఐదు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఇళ్లు అన్నీ పూర్తిగా కాలిపోయిన కారణంగా.. 8 గిరిజన కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. సుమారు రెండున్నర లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.

ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. నష్టపరిహారాన్ని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

విశాఖలో డీఎడ్​ మేనేజ్మెంట్ విద్యార్థుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.