విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం మల్లవరం సమీపంలోని పశువుల పాకలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో 14 పాడి పశువులు సజీవదహనమయ్యారు. గ్రామానికి చెందిన మిడతల రామచంద్రరావు అనే రైతు పశువుల పాకలో ఈదురుగాలులతో విద్యుత్ తీగలు తెగి షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు.
ఇదీ చదవండి