నర్సీపట్నం ఇందిరా మార్కెట్ ప్రాంతం రెడ్జోన్లోకి వెళ్లిన కారణంగా.. ఆ మార్కెట్ పూర్తిగా మూత పడింది. ఈ క్రమంలో చిల్లర వర్తకులు ఎక్కడికక్కడే వీధి దుకాణాలు వేసుకుంటూ కాలం గడుపుతున్నప్పటికీ... తమకు ప్రత్యామ్నాయం లేని కారణంగా నర్సీపట్నానికి సమీపంలోని పెద్ద బొడ్డేపల్లి వద్ద వ్యవసాయ మార్కెట్ యార్డులో అద్దె ప్రాతిపదికన వ్యాపారం కొనసాగిస్తున్నారు.
అయితే ఇందిర మార్కెట్లో ఉన్న సదుపాయాలు వ్యవసాయ మార్కెట్లో లేకపోవడంతో తాము అనేక కష్టాలకు గురవుతున్నామని... సరుకులు కుళ్లిపోయి నష్టపోతున్నామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదోకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: