విశాఖ జిల్లా మునగపాక మండలం కుమారపురానికి చెందిన రైతు దాసుపాత్రుని వెంకట విష్ణుమూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతనికి సర్వే నంబర్ 101లో 23 సెంట్ల భూమి ఉంది. పూర్వీకుల నుంచి ఆ స్థలంలో కొబ్బరి, మామిడి చెట్లను పెంచుతూ వస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఇదే భూమి గ్రామకంఠం పేరుతో నమోదై ఉన్న కారణంగా.. అధికారులు బలవంతంగా భూమిని సేకరించారు. అప్పటికే.. వ్యవసాయం కోసం చేసిన అప్పులు వేధిస్తుండడం, ఉన్న భూమిని అధికారులు లాక్కోవడంపై.. విష్ణుమూర్తి మనస్తాపం చెందినట్టు బాధిత కుటుంబీకులు చెప్పారు. అతను ఆత్మహత్య చేసుకోగా.. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని ఆవేదన చెందారు.
ఇదీ చూడండి: