విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం గురందొరపాలెం గ్రామానికి చెందిన చిరంజీవి (50) అనే రైతు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన కేదారి శెట్టి రాము అనే రైతు వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే మధ్యాహ్నం భోజనం ముగించుకుని పొలంలో పనుల పర్యవేక్షణకు వచ్చాడు. సాయంత్రం 6 గంటల సమయంలో పొలం పాకల వద్ద చిరంజీవి హత్యకు గురైనట్లు స్థానికులు గమనించారు. గ్రామస్థులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతని భార్య, ఇద్దరు కుమార్తెలు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
![farmer murdered at fields in narsipatnam mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7221128_111_7221128_1589645875280.png)
ఇదీ చదవండి :