లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ పేద కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన విశాఖ జిల్లా నక్కపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కర్రి నానాజీ, పార్వతి దంపతులు టైలరింగ్ పనలు చేసేవారు. లాక్డౌన్ వలన పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు మెుదలయ్యాయి. ఈ క్రమంలో భార్యభర్తలకు వివాదం జరగటంతో మనస్థాపంతో నానాజీ రసాయన ద్రావణాన్ని తాగి ఆత్మహత్యాయత్నం పాల్పడ్డాడు. నానాజీను ఆసుపత్రికి తరలించే సమయంలో ఆటో నుంచి పార్వతి జారి పడి మృతి చెందింది. ప్రస్తుతం నానాజీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'రైతులు, పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి'