ETV Bharat / state

రైలు నుంచి జారిపడి.. వివాహిత మృతి

విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో ఓ వివాహిత ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందింది. మృతురాలు కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన సింధుగా గుర్తించారు.

author img

By

Published : Jul 10, 2019, 6:02 AM IST

వివాహిత మృతి
వివాహిత మృతి

ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పిసినికాడ వద్ద చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన సింధు విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని తన పుట్టింటికి వెళ్లి పూరీ-తిరుపతి రైల్లో తిరుగు ప్రయాణమైంది. అనకాపల్లి దాటాక బాత్రుంకి వెళ్లిన సింధు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడింది. బాత్రుంకి వెళ్లిన సింధు కనిపించకపోవటంతో ఆమె కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అనకాపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ పై యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి విషయాన్ని రైల్వే పోలీసులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి సింధుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీచదవండి

''తెదేపాను వీడడం''పై.. వల్లభనేని ఏమన్నారంటే?

Intro:ap_cdp_17_09_rapu_kanna_raka_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలను అవలంబిస్తున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ఆరోపించారు. కడప జిల్లా జమ్మలమడుగు లో నిన్న జరిగిన రైతు దినోత్సవంలో రైతులకు ఇస్తున్న పెన్షన్ల లో సగ భాగం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని విషయాన్ని చెప్పకపోవడం దారుణమని ఖండించారు. కడప లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. గతంలో కూడా చంద్రబాబు నాయుడు కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ తామే ప్రవేశపెట్టామని చెప్పడం తో ఓటమి చవిచూశారు చెప్పారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా రేపు కడప కు భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ వస్తున్నారని తెలిపారు. కన్నా సమక్షంలో భారీ ఎత్తున పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు భాజపా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఏపీ లో రాబోయే ఐదేళ్లలో కమలం గుర్తు ఎగురవేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు.
byte: బండి ప్రభాకర్, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, కడప.

Body:రేపు కన్నా లక్ష్మీనారాయణ రాక

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.