ETV Bharat / state

కేటుగాడు... ఎస్సైనంటూ యువతిని నమ్మించి వంచించాడు! - విశాఖ జిల్లా నేర వార్తలు

విశాఖలో ఓ కేటుగాడు ఎస్ఐ అవతారమెత్తాడు. మాయ మాటలతో అమాయక యువతిని వలలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేశాడు. లక్షలు కాజేసి కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం పోలీసు స్టేషన్​కు వెళ్లిన యువతి... తన భర్త నకిలీ ఎస్​ఐ అని తెలుసుకుని.. మోసపోయానని కన్నీటిపర్యంతమైంది.

fake si betrayed a young woman in vishaka district

author img

By

Published : Jun 22, 2020, 5:58 AM IST

Updated : Jun 22, 2020, 6:25 AM IST

పోలీసు దుస్తుల్లో పోజు కొడుతున్న ఈ వ్యక్తి పేరు రామచంద్రరావు. ఘరానా మోసగాడు. ప్రేమ పేరుతో ఓ అమాయకురాలిని నిలువునా ముంచేశాడు. ఎస్ఐగా పని చేస్తున్నట్లు చెప్పి విశాఖ జిల్లా కంచరపాలేనికి చెందిన యువతిని గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు. సస్పెన్షన్‌లో ఉన్నట్లు పెళ్లి సమయంలో కట్టు కథ చెప్పాడు. మాయ మాటలు కొనసాగిస్తూ 8 నెలలు కాపురం చేశాడు. గ్రూప్-1 ఉద్యోగానికి సిద్ధమవుతున్నానంటూ భార్య తండ్రి నుంచి 12 లక్షల రూపాయల నొక్కేశాడు.

fake si betrayed a young woman
నిందితుడు రామచంద్రరావు

ఆమె నగలు తాకట్టు పెట్టి మరో 8 లక్షల రూపాయల వరకు సొమ్ము చేసుకున్నాడు. ఉద్యోగం నిమిత్తం అమరావతి వెళ్తున్నానంటూ ఫిబ్రవరి 14 నుంచి కనిపించకుండా పోయాడు. రామచంద్రరావు కోసం ఎంత గాలించినా ఆచూకీ తెలియని బాధితురాలు... పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకున్నవాడు నకిలీ ఎస్ఐ అని అప్పుడు బాధితురాలికి తెలిసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి ప్రేమికుల రోజునే కేటుగాడు మస్కా వేయగా... ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. కోటి రూపాయలు కట్నంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే విడాకులు తీసుకోవాలని బెదిరింపులకు దిగారని యువతి చెబుతోంది. మోసగాడి కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని.... తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది.

ఇదీ చదవండి:

ఆడపిళ్ల ఎందుకని ఆయువు తీసేశారు

Last Updated : Jun 22, 2020, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.