ETV Bharat / state

'ఆదివాసీలకు అందుబాటులోకి అత్యాధునిక కంటి వైద్యసేవలు' - చింత‌ప‌ల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో తాజా వార్తలు

ఆదివాసీలకు అత్యాధునిక కంటి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని పాడేరు జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కె.లీలా ప్రసాద్‌ అన్నారు. చింత‌ప‌ల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐ కేర్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.

eye care center open at chintapalli Community Health Center
దివాసీలకు అత్యాధునిక కంటి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి
author img

By

Published : Nov 3, 2020, 5:22 PM IST

విశాఖ జిల్లా చింత‌ప‌ల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పాడేరు ఐటీడీఏ సహకారంతో దృష్టి సంస్థ... ఐ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని పాడేరు జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కె.లీలాప్రసాద్ ప్రారంభించారు. ఆదివాసీలకు అత్యాధునిక కంటి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌ అన్నారు.

ఈ ఐకేర్‌ సెంటర్‌లో అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయని... పలు రకాల దృష్టి సమస్యలకు చికిత్స పొందవచ్చన్నారు. ఇక్కడ ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్‌ డాక్టర్‌ డి.మహేశ్వరరావు, దృష్టి ఐకేర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.జగన్, తదితరులు‌ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ఆక్వా ల్యాబ్స్​ ఏర్పాటుకు పాలనా అనుమతులు జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.