విశాఖ ఏజెన్సీలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన.. భారీ గంజాయి డంపును ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురంలో తెల్లవారుజామున ఎక్సైజ్ పోలీసులు, ముంచింగిపుట్టు సివిల్ పోలీసులు సంయుక్తంగా సినీఫక్కీలో అర్ధరాత్రి ఓ ఇంట్లో దాడి చేశారు. అక్కడ రవాణాకు సిద్ధంచేసిన.. సుమారు వెయ్యి కిలోల గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులు ఒడిశాలోని జైపూర్ కు చెందిన వాడని పోలీసులు గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నారు. దాడుల్లో దొరికిన గంజాయిని పాడేరు ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.
1000 కిలోల గంజాయి పట్టివేత.. ఎలాగో తెలుసా?
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఓ భారీ గంజాయి డంపుపై పోలీసులు అర్ధరాత్రి తరువాత దాడి చేశారు. పరారీలో ఉన్న ఒడిశాకు చెందిన నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.