స్టైరీన్ ఆవిర్ల లీకేజీ ప్రభావాలపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఆవిరి, విషవాయువుల కారణంగా పచ్చని చెట్లు ఎండిపోయాయి. పర్యావరణ నిపుణులు ఆయా చెట్ల నుంచి నమూనాలను సేకరించారు. ఆ చెట్లకున్న పండ్లు గట్టిపడినట్లు గుర్తించారు.
పండ్లు గట్టిపడడానికి దారితీసిన రసాయనిక చర్యలు ఏమిటన్న అంశంపైనా ఆరా తీస్తున్నారు. పండ్లు రంగు మారడాన్నీ గుర్తించారు. అరటికాయలు నల్లబడిపోయాయి. నిమ్మకాయలు గోధుమ రంగులోకి మారాయి. చెట్లు కూడా రంగు మారడంతో.. వాటి ఆకులను సేకరించారు.
- భూమిలోని మట్టిపొరలు ఎలాంటి ప్రభావానికి గురయ్యాయన్న విషయంపైనా శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. మట్టి ఎలా కలుషితమైంది, ఆ ప్రాంతంలో వృక్షజాతులపై కలిగే ప్రభావాలపైనా అధ్యయనం చేయనున్నారు.
- నీటిని అధ్యయనం చేస్తే మరిన్ని విషయాలు తెలియవచ్చన్న ఉద్దేశంతో ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఓ బావి నుంచి నీటిని తీసుకున్నారు.
'స్టైరీన్ ఆవిరితో వృక్షజాతులపై ప్రభావం గురించి ఇప్పటివరకు దేశంలో ఎప్పుడూ ప్రయోగాలు జరగలేదు. ఆర్.ఆర్.వెంకటాపురంలో స్టైరీన్ ప్రభావానికి గురైన చెట్ల పండ్లను, ఆకులను సేకరించాం. మా పరిశోధనశాలల్లో పూర్తిగా అధ్యయనం చేశాక గానీ వాటిలో ఎలాంటి మార్పులు జరిగాయన్న విషయాల్ని చెప్పలేం.' - డాక్టర్ జార్జి, నీరి, నాగ్‌పుర్
ఇదీ చదవండి: