ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రిలో భూత వైద్యం.. డాక్టర్లు ఏం చేస్తున్నారు?

ఆమెకు జ్వరం వచ్చింది. ఆసుపత్రికి తీసుకువెళ్లారు. నాలుగు రోజులైంది. అయినా మార్పు రాలేదు. రోజురోజుకూ నీరసించిపోతోంది. చివరికి అందుబాటులో ఉన్న మహిళా భూత వైద్యురాలిని ఆసుపత్రి వార్డుకు తీసుకువచ్చారు. ఆమె వార్డులోనే రోగి నాడి పట్టుకుని మంత్రాలు జపించింది. ఈ దృశ్యం విశాఖ ఏజెన్సీ పాడేరు ఆసుపత్రిలో కలకలం సృష్టించింది.

Exorcist visited  hospital at paderu
పాడేరు ఆసుపత్రిలో భూత వైద్యం
author img

By

Published : Jul 27, 2021, 8:26 AM IST

పాడేరు ఆసుపత్రిలో భూత వైద్యం

విశాఖ జిల్లా హుకుంపేట మండలం రాపపంచాయతీ ఈదులగరువులో గెమ్మెలి ఆంబే బాంబే అనే మహిళకు జ్వరం వచ్చింది. చాలా రోజులు అవుతున్నా.. జ్వరం తగ్గడం లేదు. అంబులెన్స్​లో పాడేరు జిల్లా ఆస్పత్రికి ఆమెను తీసుకువెళ్లారు. ఐదు రోజులైంది అయినా మార్పు లేదు. పరీక్షల్లో రోగం గురించి తెలియలేదు. రోజురోజుకీ ఆమె నీరసించిపోతోందని.. దెయ్యం పట్టినట్టు ఉంటుందని కుటుంబసభ్యులు అనుమానించారు.

ఏజెన్సీ కొండల్లో పూజలు చేసే మంత్రసానిని ఏకంగా ఆసుపత్రికే తీసుకొచ్చారు. ఆ వార్డులో అందరూ చూస్తుండగానే.. ఆ భూత వైద్యురాలు రోగి నాడి పట్టుకుని మంత్రాలు చదివేసింది. తోటి రోగులు అందరూ చూస్తుండగానే భూత వైద్యం పూర్తి చేసింది. మహిళకు శాంతి శాంతి అంటూ సపర్యలు చేసింది. ఇదంతా... ఎదురుగా మందుల కౌంటర్లో నర్సులు చూస్తూనే ఉన్నారు. అదే సమయంలో పురుషుల వార్డులో... వైద్యులు రోగులను పరీక్షిస్తున్నారు.

అయినా.. ఆ భూత వైద్యురాలు.. బాధితురాలికి వైద్యం చేస్తూనే ఉంది. పాడేరు ఏజెన్సీ పెద్దాస్పత్రిలో ఇలాంటి వాతావరణం విస్తుపోయేలా చేసింది. ఆధునిక కాలంలో.. ఇంకా ఇలాంటి తీరును ప్రజలు నమ్ముతుండడం.. కొందరిని ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా.. భూతవైద్యంతో బాగుపడతామని బాధితురాలి కుటుంబీకులు చెప్పడం.. తన వైద్యంతో బాధితురాలికి నయం అవుతుందని.. ఆ భూత వైద్యురాలు సైతం చెప్పడం.. ఆ ప్రాంతంలోని ప్రజల మానసిక స్థితిని తెలియజేస్తోంది.

ఇదీ చూడండి:

CM Jagan: 'వ్యవసాయ రంగం ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.