విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం తిమిరాం గ్రామంలో కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు తెదేపా ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందజేశారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ ఆయన సతీమణి ఎంపీపీ అభ్యర్ధి సత్యవేణి నిత్యవసరాలు సమకూర్చారు. మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు చేతుల మీదుగా ప్రజలకు అందజేశారు. 450 కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి