రాష్ట్రంలో ఆక్సిజన్ అందక చాలా మంది మృతి చెందుతున్నారని.. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆవేదన చెందారు. కరోనాతో మృతిచెందిన వారికి బీమాను వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సీఎంగా చంద్రబాబు ఉండి ఉంటే.. కరోనాను సమర్థంగా ఎదుర్కొని ప్రజలకు మెరుగైన సేవలు అందించే వారిని అభిప్రాయపడ్డారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును.. విశాఖ జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులర్పించారు.
ఇదీ చదవండి:
కేంద్రం ఇచ్చిన నిధుల్లో సగం ఖర్చు చేసినా వాక్సిన్లు కొనుగోలు చేయెచ్చు: పట్టాభి