కౌలు రైతులకు రైతు భరోసా కల్పించాలని కోరుతూ.. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఆయన స్వగృహం వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన చేపట్టారు. అనకాపల్లి బెల్లం మార్కెట్‌ను తెరిపించాలని.. కొవిడ్ సమయంలో వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలని కోరారు. వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా అందుబాటులోకి తీసుకురండి: హైకోర్టు