ETV Bharat / state

'చిన్నపిల్లలకు లాక్​డౌన్ మంచి అవకాశం' - యూనిసెఫ్ తాజా వార్తలు

లాక్​డౌన్ వేళ పిల్లల్లో ఎదురయ్యే సమస్యలపై ఆయా జిల్లా యంత్రాంగాలకు సమగ్ర సూచనలు ఇస్తున్నామని, వాటిని నివారించేట్టుగా చర్యలను అమలు చేయాలని కొరినట్టు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వెల్లడించింది. ఇంటివద్ద పిల్లలతో కలిసి పెద్దలు ఎక్కువసేపు గడపొచ్చని ఇది ఒకరకంగా మంచి అవకాశమని....ఈ సమయంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి ఓపికగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కమిషన్ ఛైర్​పర్సన్ గంటా హైమావతి అభిప్రాయపడ్డారు. లాక్​డౌన్ తర్వాత విద్యా విధానంలోనూ ..వివిధ విషయాలలో వచ్చే మార్పులకు బాలలు సిద్ధమయ్యే విధంగా చూడాల్సిన అంశాలపై దృష్టిపెట్టామని, ఇందులో యూనిసెఫ్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నామని చెబుతున్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ హైమావతితో ఈటీవీ భారత్ ముఖాముఖి

etv bharat interview with   State Child Rights Protection Commission
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
author img

By

Published : May 19, 2020, 7:03 AM IST

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ప్రశ్న: లాక్​డౌన్ వేళలో పిల్లలు ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు..ఈ సమయంలో చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?

హైమావతి: కొన్ని సందర్భాలలో వారు ఒత్తిడిగా ఫీలవుతున్నారు. అలాంటి సమయంలో వారితో కొంచెం లాలనగా మాట్లాడటం, కొత్త అభిరుచులను పరిచయం చేస్తే సంతోషంగా ఉంటారు..వాళ్లు భవిష్యత్తులో ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా..అమ్మ నేర్పించిన కొత్త అభిరుచులపై మనసు వెళుతుంది. ఇదో ఎంతో మానసికంగా సంతృప్తినిస్తుంది.

ప్రశ్న: లాక్​డౌన్ నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు బయటికి వెళ్లి..ఇంట్లోకి వచ్చినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? దీనిపై బాలలహక్కుల సంఘం పిల్లలకు, తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన కల్పించింది. ?

హైమావతి: యూనిసెఫ్ ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీగా నివేదికను తయారు చేశారు. కరోనా ఎలా వస్తుందో తెలిపే కామిక్ చిత్రాలతో పొందుపరిచారు. ఎలా కట్టడి చేయాలో బొమ్మల ద్వారా తెలిపారు.

ప్రశ్న: చంటిపాపలతో, చిన్నపిల్లలతో, సరిగా నడవలేని చిన్నారులతో వలస కూలీలు మండుటెండలో కాలినడకన సొంత రాష్ట్రాలకు తరలివెళుతుంటే..కమిషన్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది.?

హైమావతి: వలస కూలీలతో చిన్నపిల్లలు ఉంటే..వారికి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పరీక్షలు చేసి...ఆహారం, దుస్తులను అందిస్తున్నాము. వారి గ్రామాలకు వెళ్లడానికి వాహన సౌకర్యం కల్పిస్తున్నాము. అనారోగ్యంగా ఉన్న చిన్నారులకు వైద్యం అందిస్తున్నాము.

ప్రశ్న: విద్యాబోధన విధానంలో చాలా మార్పులు రాబోతున్నాయి.. లాక్​డౌన్ సడలింపులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య వస్తున్న తరుణంలో.. కమిషన్ ఏవిధంగా విద్యార్థులకు సూచనలిస్తుంది?

హైమావతి: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో భౌతికదూరం, శానిటైజర్​తో చేతులను శుభ్రం చేసుకోవడం వంటివి కచ్చితంగా పాటించేలా చర్యలు చేపడుతాం..వాటిని పట్టించుకోని పాఠశాలలో అధికారులపై కఠిన చర్యలను తీసుకుంటాం.

ప్రశ్న: కరోనా తదనాంతరం బాలల ప్రాంతాలను పునరుద్ధరించినపుడు యూనిసెఫ్ ఎలాంటి జాగ్రత్తలను సూచించింది...?

హైమావతి: కరోనా వల్ల వలసలు ఎక్కువయ్యాయి. వలస కూలీల చిన్నపిల్లలందరూ వాళ్ల ఇళ్లకు చేరుకున్నారు. ఇప్పుడు ఎంతమంది పాఠశాలకు వెళ్లే చిన్నారులు, వెళ్లనివారి సంఖ్య తెలుస్తుంది. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలలోని తల్లింతండ్రులు పిల్లలను పనిలో ఉంచుతారు. పాఠశాలలు ప్రారంభం కావడానికి రెండునెలల సమయం ఉంది కాబట్టి..వీటిపై నివేదిక తయారు చేస్తున్నాం. చిన్నారులను బడికి పంపేలా తల్లిదండ్రులతో మాట్లాడి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాం.

ఇదీచూడండి.

పాపతో పని చేయించడం... వారికి పాపమని అనిపించలే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.