విశాఖ మన్యంలో గ్యాస్ కోసం ప్రజలు కిలో మీటర్ మేర బారులు తీరారు. ఈ కథనాన్ని ఈనాడు, ఈటీవీ భారత్ కథనం ప్రచురించింది. దీనిపై ఐటీడీఏ అధికారి డీకే బాలాజీ స్పందించారు. ఐటీడీఏ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని తనిఖీ చేసి.. రికార్డులు పరిశీలించారు. ఇకనుంచి పాడేరులో ఇంటింటికి వెళ్లి గ్యాస్ పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కార్యాలయంలోనే గ్యాస్ అందజేయాలని ఆదేశించారు. కరోనా కట్టడి దృష్ట్యా ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడవద్దని తెలిపారు.
ఇవీ చదవండి: కరోనా పరిస్థితులపై తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం