విశాఖ జిల్లా మాల్కాపురంలోని కరోనా షెల్టర్ జోన్లో వలస కార్శికులను రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు పరామర్శించారు. అక్కడి వారికి అందే సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విశాఖ ఎంపీ సత్యనారాయణతో కలిసి ఆయన పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రజలు వాటిని తీసుకునేందుకు గుంపులు గుంపులుగా తరలివచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఒక్కసారిగా గుమికూడడం విమర్శలకు తావిచ్చింది.
ఇదీ చూడండి: