ETV Bharat / state

కొత్తగా పెళ్లైందా..? సొంతిల్లైనా.. అద్దె ఇల్లైనా ఇవి ఉంటే బెటర్​..!

Home Decoration Tips : కొత్త జంట.. కొత్త కాపురం.. కొత్త ఇల్లు.. అప్పుడే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన జంటలకు తమ జీవితంలో అన్నీ కొత్త అనుభవాలే ఎదురవుతుంటాయి. ముఖ్యంగా తమ ఇంటిని తీర్చిదిద్దుకోవడంలో వారి మనసుల్లో కొంత సందిగ్ధత నెలకొంటుంది. ఎలాంటి ఫర్నిచర్‌ కొనాలి? ఏది అనవసరం? అన్న స్పష్టత కొంతమందికి ఉండదు. మరికొందరేమో.. ‘అద్దె ఇల్లే కదా.. ఇప్పుడే అన్ని వస్తువులు కొనడం ఎందుకు?’ అన్న ఆలోచనతో ఉంటారు. కానీ సొంతిల్లైనా, అద్దె ఇల్లైనా కొన్ని వస్తువుల్ని అమర్చుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. తద్వారా ఇల్లు అందంగా కనిపించడంతో పాటు.. నీట్‌గానూ ఉంటుందంటున్నారు.

అద్దె ఇల్లైనా ఇవి ఉంటే బెటర్​..!
అద్దె ఇల్లైనా ఇవి ఉంటే బెటర్​..!
author img

By

Published : Nov 22, 2022, 3:25 PM IST

Home Decoration Tips : మనం ఎక్కువ సమయం గడిపేది, అతిథులొచ్చినా కూర్చునేది లివింగ్‌ రూమ్‌లోనే. కాబట్టి అక్కడ స్థలాన్ని బట్టి ఓ చక్కటి సోఫాసెట్‌ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక బడ్జెట్‌ గురించి ఆలోచించే వారైతే కేన్‌, చెక్కతో తయారుచేసినవి అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. ఇక లివింగ్‌ రూమ్‌ కాస్త పెద్దగా ఉన్న వారు.. అక్కడక్కడా సైడ్ ఛైర్స్‌ ఏర్పాటు చేస్తే.. ఎక్కువ మంది అతిథులొచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా జాగ్రత్తపడచ్చు.

...

⚜ ఇంటికి కావాల్సిన అత్యవసర వస్తువుల్లో డైనింగ్‌ టేబుల్‌ ఒకటి. ఇది ఇంటికి కొత్త కళనూ తీసుకొస్తుంది. అయితే ప్రస్తుతం ఎవరి అవసరాలకు అనుగుణంగా.. ఇద్దరు, నలుగురు, ఆరుగురు.. కూర్చొనే డైనింగ్‌ టేబుల్స్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి. అంతేకాదు.. ఇరువైపులా/నాలుగువైపులా కుర్చీలుండి.. మరోవైపు బెంచ్‌ తరహాలో ఉండేవి కూడా రూపొందుతున్నాయి. ఇవేవీ వద్దనుకున్న వారు.. ఇంట్లో స్థలాన్ని ఆదా చేసుకోవాలనుకునే వారు.. గోడకు ఫోల్డింగ్‌ తరహాలో ఉండేలా ఓ వాల్‌మౌంటెడ్‌ చెక్కను ఫిట్‌ చేయించుకొని.. ఇరువైపులా రెండు కుర్చీలూ వేసుకోవచ్చు.. అవసరం లేనప్పుడు ఆ చెక్కను ఫోల్డ్‌ చేసుకోవచ్చు.

⚜ ప్రస్తుతం చాలామంది ఇంటీరియర్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో డ్రస్సింగ్‌ టేబుల్‌ విషయంలోనూ పలు మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. దీనికి బదులు ఇంట్లోనే తమకు అనువైన చోట ఓ మిర్రర్‌ ఏర్పాటుచేయించుకొని.. దానికి కింది భాగంలో వాల్‌ మౌంటెడ్‌ ర్యాక్‌ని ఏర్పాటుచేసుకొనే వారూ లేకపోలేదు. దీనివల్ల బడ్జెట్‌ కూడా ఆదా అవుతుంది. అంతేకాదు.. ఇల్లు మారేటప్పుడు సులభంగానూ ఉంటుంది.

⚜ తక్కువ స్థలంలో ఇమిడిపోవాలి.. ఎక్కువ స్టోరేజ్‌ అమర్చుకునేలా ఉండాలి.. ఏ ఫర్నిచర్‌ కొన్నా మనం ఇదే విషయం గుర్తుపెట్టుకుంటాం. అందుకే మన ఆలోచనలు, అభిరుచుల్ని బట్టే ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థలు ప్రస్తుతం స్టోరేజ్‌ బెడ్స్‌, సోఫాసెట్స్‌, కాఫీ టేబుల్స్‌.. వంటివెన్నో రూపొందిస్తున్నాయి. కాబట్టి ఇంట్లో స్థలాన్ని బట్టి ఆయా సైజుల్లో ఉండే వస్తువుల్ని ఎంచుకుంటే ఇల్లు నీట్‌గా కనిపిస్తుంది.

⚜ వంటగదిలో ఎన్ని అరలున్నా సరిపోవు. నిజానికి మన సొంతిల్లైతే ఉన్న వస్తువుల్ని బట్టి షెల్ఫులు డిజైన్‌ చేయించుకుంటాం. అద్దె ఇంట్లో ఈ సౌలభ్యం ఉండదు. కాబట్టి ఇలాంటప్పుడు కిచెన్‌ ట్రాలీస్‌ చక్కటి ప్రత్యామ్నాయం. పైగా ఇవి తక్కువ ధరలోనే దొరుకుతాయి. ఇంటికి కొత్త అందాన్నీ తీసుకొస్తాయి. ఇక వీటిని నేలపైనైనా అమర్చుకోవచ్చు.. లేదంటే వాల్‌ మౌంటెడ్‌గానైనా ఏర్పాటు చేసుకోవచ్చు.

⚜ ఇంటి నుంచి పనిచేసే వారు ప్రత్యేకంగా ఓ గదినే ఆఫీస్‌ రూమ్‌గా కేటాయించుకోవడం మనం చూస్తుంటాం. అయితే అందరికీ ఆ వెసులుబాటు ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి వారు స్లీక్‌ టేబుల్‌, దానికి అనుబంధంగా వచ్చిన కుర్చీ సెట్‌ని ఎంచుకోవచ్చు. దీనివల్ల ఇంట్లో స్థలమే కాదు.. బడ్జెట్‌ కూడా ఆదా అవుతుంది.

ఇవీ చూడండి..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.