ETV Bharat / state

'ఉన్నఫళంగా పొమ్మంటే.. ఎక్కడకు వెళ్లిపోవాలి?'

విశాఖ కేంద్ర కారాగారం ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను.. అధికారులు తొలగించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పట్టాలు ఇచ్చారని.. ఇప్పుడు భూములు లాక్కోవడం దారుణమని బాధితులు వాపోతున్నారు.

vizag lands issue
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగింపు
author img

By

Published : Dec 23, 2020, 1:47 PM IST

ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగింపు

విశాఖలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు వివాదాస్పదమైంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నట్లు బాధితులు ఆధారాలు చూపినా.. అధికారులు మాత్రం గుడిసెలు కూల్చివేశారు. జీవీఎంసీ పరిధిలో ముడసర్లోవ ప్రాంతంలోనే కేంద్ర కారాగారం ఉంది. ఈ ప్రాంతంలోనే 1975-76లో.. ప్రభుత్వం కొంతమంది గిరిజనులకు భూములను సాగు చేసుకునేందుకు ఇచ్చింది. దాదాపు 69 కుటుంబాలకు ఇచ్చిన ఈ భూముల్లో కొంత మేర జీడిమామిడి తోటలు సైతం ఉన్నాయి. అప్పటి నుంచి చిన్న గుడిసెలు, రేకుల షెడ్డులు వేసుకొని ఉంటున్నారు.

బీఆర్టీఎస్ రహదారి అభివృద్ధి కావటం... భూముల విలువ అమాంతం పెరగటంతో.. ప్రభుత్వ భూములపై పలువురి దృష్టి పడింది. ఈ క్రమంలో... తెల్లవారుజామునే జీవీఎంసీ అధికారులు.. జేసీబీల సాయంతో గుడిసెలు, పశువుల షెడ్లు కూల్చివేశారు. ఈ భూములకు సంబంధించిన పట్టాలు తమ దగ్గర ఉన్నాయని మొత్తుకున్నా.. అధికారులు చెల్లవని చెప్పారని బాధితులు వాపోతున్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయం నుంచి తాము ఈ ప్రాంతంలోనే ఉన్నామనీ.. ఇప్పుడు వెళ్లిపొమ్మంటే ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు.

అధికారులు ఏమన్నారంటే..

ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించినట్లు డిప్యూటీ సిటీ ప్లానర్ తెలిపారు. మెుత్తం 50 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగిలిన వాటిని పరిశీలిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాల తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.