ETV Bharat / state

పచ్చని అడవిలో నెత్తుటి మరక.. మన్యంలో తుపాకుల గర్జన

author img

By

Published : Jun 17, 2021, 6:37 PM IST

పచ్చని మన్యం మళ్లీ నెత్తురోడింది. బుధవారం ఉదయాన్నే తుపాకుల మోతతో గిరిసీమ వణికిపోయింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఒక్కసారిగా భయానక వాతావరణం ఆవరించింది. కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందడం మన్యంలో పరిస్థితులను ఉద్విగ్నంగా మార్చింది.

manyam
manyam

ప్రశాంతంగా ఉన్నమన్యం నెత్తురోడింది. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో భయానక వాతవరణం నెలకొంది. తీగలమెట్ట ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందడంతో పరిస్థితి ఉద్విగ్నంగా మారింది.

నెలరోజుల క్రితం కొయ్యూరు మండలంలో ఇదే ఘటన స్థలానికి దగ్గరలో పాలసముద్రం వద్ద ఎదురు కాల్పులు జరిగాయి. అప్పుడు కూడా పక్కా సమాచారంతో వెళ్లినా అప్పటికే మావోయిస్టులు తప్పించుకున్నారు. ఈసారి మాత్రం తూటాలకు నేలకొరిగారు.

2020లో చింతపల్లి మండలం దిగువజనబ వద్ద ఎదురు కాల్పులు జరిగి ఒక మావోయిస్టు చనిపోయారు. పెదబయలు మండలంలో లండులు, మెట్టగుడ ప్రాంతాల్లోనూ ఎదురుకాల్పులు జరిగినా ప్రాణనష్టం సంభవించలేదు.

2019 అక్టోబర్‌లో గాలికొండ అటవీ ప్రాంతంలోని పేములగొంది వద్ద జరిగిన వరుస ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ ఏడాదిన్నర కాలంలో ఇరువర్గాల మధ్యా అడపాదడపా ఎదురుకాల్పుల ఘటనలు చోటుచేసుకున్నా ప్రాణనష్టం పెద్దగా జరగలేదు. రామ్‌గుడ ఎన్‌కౌంటర్‌ తరువాత జరిగిన ఎదురుకాల్పుల్లో ఒకేసారి ఆరుగురు మావోయిస్టులు చనిపోవడం, అందులో ఇద్దరు డీసీఎం స్థాయి నేతలుండడం ఇదే మొదటి ఘటనగా చెప్పవచ్చు. ఏవోబీలో పార్టీని బలపరిచేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరగడం మావోయిస్టులకు పెద్ద దెబ్బగానే పోలీసులు భావిస్తున్నారు.

నిశ్శబ్దంగా ఉన్న యూ.చీడిపాలెం గ్రామం

తూర్పు గోదావరి జిల్లాకు ఆనుకుని ఉన్న తీగలమెట్ట వద్ద దట్టమైన అటవీప్రాంతంలో మావోయిస్టులు పెద్దసంఖ్యలో ఆశ్రయం పొందారనే పక్కా సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతానికి చుట్టుపక్కలున్న బలగాలకు సమాచారం చేరవేశారు. అక్కడికి మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ పార్టీ బయలుదేరింది. చిమ్మచీకటి, దట్టమైన అడవి కావడంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ సుమారు 10 గంటల పాటు నడిచి మావోలున్న ప్రాంతానికి చేరుకున్నారు. అందుకే ఉదయం 9.30 ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. సాధారణంగా తెల్లవారుజామునే జరుగుతుంటాయి. బలగాలు దూరంగా ఉండడం ఎక్కువ సమయం నడవడం వల్లే అప్పటికిగాని చేరుకోలేకపోయారు. అప్పటికే తూర్పుగోదావరి పోలీసులు, గూడెం కొత్తవీధి నుంచి మరో బృందం అడవిని చుట్టుముట్టాయి. మొదటి బృందం నుంచి తప్పించుకుని ఎవరైనా వస్తే వలపన్ని పట్టుకోవాలని ప్రణాళిక రచించుకున్నారు. ఇరువైపుల నుంచి చాలా దగ్గరగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. తొలుత ఇద్దరు మహిళా మావోయిస్టులు చనిపోగా తరువాత డీసీఎం రణదేవ్‌ నేలకొరిగినట్లు సమాచారం. ఆయన దగ్గరే ఏకే-47 ఉంది. ఇటీవల మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ సీఆర్‌పీఎఫ్‌ పోలీసులపై దాడిచేసి 14 ఏకే-47 గన్‌లు తీసుకుపోయారు. అందులో ఇదొకటయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ప్రత్యేక వ్యూహంతో ముందడుగు

ఏఓబీలో గత మూడేళ్లగా పోలీసులు పైచేయి సాధిస్తూనే ఉన్నారు. డుంబ్రిగుడ మండలం లివిటుపుట్టులో మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యతో మావోయిస్టులు బలమైన సవాల్‌ విసిరారు. అప్పటి నుంచి పోలీసులు పట్టు పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులేశారు. మావోయిస్టు షెల్టర్‌ జోన్‌లో సుమారు 16 అవుట్‌ పోస్టులు ఏర్పాటుచేశారు. ఇదే సమయంలో మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు, గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా యువతకు దగ్గరయ్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో మావోయిస్టు కేడర్‌ రిక్రూట్‌మెంట్‌ తగ్గిపోయింది. మరో పక్క కీలక నాయకులు, దళ సభ్యులు, మిలీషియా సభ్యుల అరెస్టులు, లొంగుబాట్లతో ఏఓబీలోని తూర్పు డివిజన్‌లో గాలికొండ, కోరుకొండ దళాలు బలహీనపడ్డాయి. దీంతో ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌ను దిగుమతి చేసుకుని ఏఓబీలో మావోయిస్టులు కార్యకలాపాలు నిర్వహించుకునే పరిస్థితి ఏర్పడింది. గడిచిన రెండు సంవత్సరాలు కాలంలో ఏఓబీలో జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో అధికంగా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే కావడం గమనార్హం.

నిర్మానుష్యంగా సరిహద్దు పనసలపాలెం గ్రామం

రెండు నుంచి మూడు గంటల పాటు సాగిన ఈ ఎదురుకాల్పులు తరువాత పోలీసు బలగాలు ఘటన ప్రదేశంలో ఆరుగురి మృతదేహాలను కనుగొన్నారు. ఇందులో లలిత అనే మావోయిస్టు గూడెంకొత్తవీధి మండలానికి చెందినవారిగా గుర్తించారు. మిగతావారిలో గంగయ్య అలియాస్‌ డా.అశోక్‌ తెలంగాణకు చెందిన డీసీఎం నేత, రణదేవ్‌ ఒడిశాకు చెందిన నాయకుడు, సంతు, పాయకే ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు. మరో మహిళ మావోయిస్టును గుర్తించాల్సి ఉంది. ఎదురుకాల్పుల్లో మరికొందరు గాయాలతో తప్పించుకున్నారు. వీరి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టేసరికి అడవిలో భారీ వర్షం కురవడంతో కొంత ఆటంకం ఏర్పడింది. ఎదురుకాల్పుల్లో పాల్గొన్న బలగాలు తిరుగుముఖం పట్టగా అదనపు బలగాలు అడవిని చుట్టుముట్టే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చనిపోయిన మావోయిస్టు మృతదేహాలను నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా వీటి తరలింపులోనూ జాప్యం చోటుచేసుకుంది. ప్రత్యేక రవాణా మార్గంలో బుధవారం రాత్రికి మృతదేహాలను తరలించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

విశాఖ-తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు

దేశవ్యాప్తంగా మావోయిస్టు షెల్టర్‌ జోన్‌గా పేరుగాంచిన ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో (ఏఓబీ) చీమ చిటుక్కుమన్నా సమాచారం అందే వ్యవస్థ, క్యాడర్‌ మావోయిస్టులకు ఉంది. అటువంటి సమాచార వ్యవస్థ, క్యాడర్‌ను లక్ష్యంగా చేసుకుని వారి కంచుకోటలో పాగా వేసే దిశగా పోలీసులు ముందుకు వెళ్తున్నారు. ఎదురుకాల్పుల అనంతరం తప్పించుకున్న మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించడంతో మారుమూల గ్రామాల్లో ఎక్కడ చూసినా పోలీసు బలగాలే దర్శనమిస్తున్నాయి. అంతటా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. గిరిజనులు ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఎదురుకాల్పులు జరిగాయి మావోయిస్టులు చనిపోయారన్న విషయం తెలుసుకుని మరింత వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తోందని భయాందోళన చెందుతున్నారు. మరోపక్క ఈ ఎదురుకాల్పుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులకు గాయాలు తగిలాయన్న సమాచారంతో సంఘటన జరిగిన ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలపై పోలీసులు దృష్టి సారించారు. గాయపడ్డ వారిని ఎక్కడైనా ఉంచి వైద్యసేవలు అందించే అవకాశమున్నట్లు భావించిన పోలీసులు ఆర్‌ఎంపీ వైద్యుల కదలికలపై దృష్టి సారించారు. విశాఖ- తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో పనసలపాలెం వద్ద వై.రామవరం ఎస్సై పృథ్వీ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్‌, సివిల్‌ పార్టీ పోలీసులను మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి: maoist letter: ప్రభుత్వ విధానాలపై.. మావోయిస్టుల నిరసన లేఖ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.