ETV Bharat / state

మాచ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి - మాచ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రం న్యూస్

ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో సుమారు ఆరు గంటల పాటు ఉత్పత్తి నిలిపిపోయింది. అరకు విద్యుత్ ఫీడర్, ఎండపిల్లి వలస సబ్ స్టేషన్ లో సాంకేతిక సమస్య వల్ల గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. సాంకేతికలోపాన్ని సరిచేసి విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు అధికారులు శ్రమిస్తున్నారు.

సాంకేతిక సమస్యతో మాచ్ ఖండ్ విద్యుత్ కేంద్రంలో నిలిచిన ఉత్పత్తి

author img

By

Published : Jul 24, 2020, 4:25 PM IST

ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో సుమారు ఆరుగంటల పాటు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అరకు విద్యుత్ ఫీడర్, ఎండపిల్లి వలస సబ్ స్టేషన్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల మాచ్ ఖండ్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి గం.1.30ల నుంచి శుక్రవారం ఉదయం గం.7.30ల వరకు ఉత్పత్తి ఆగిపోయింది. దాదాపు ఆరు గంటల పాటు గంటకి 73 మెగా వాట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు.

ఉదయం గం. 7.40లకి గ్రిడ్ రావడంతో దశలవారీగా ఉత్పత్తిని పునరుద్ధరణ చేశారు. ఉదయం నుంచి 1, 2 జెనరేటర్ లను వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 32 మెగావాట్లు పునరుద్ధరణ జరిపారు. మిగిలిన రెండు యూనిట్లను పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి : గవర్నర్​ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.