విశాఖ ఏజెన్సీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. ఫిబ్రవరి 17న పాడేరు డివిజన్లో 244 పంచాయతీల్లో 237 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 2376 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 6 వేల మంది పోలింగ్ సిబ్బందిని విధుల్లో పాల్గొన్నారు. సమస్యాత్మక, అత్యంత సుదూర ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ముందస్తుగానే.. సామగ్రి, సిబ్బందిని జీపుల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావటంతో ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. మారుమూల ప్రాంతాల్లోని ఐదు పంచాయతీల పోలింగ్ కేంద్రాలను.. సమీప పోలింగ్ కేంద్రాలకు తరలించారు. అక్కడకు ప్రత్యేక వాహనాల ద్వారా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. గట్టి బందోబస్తు నడుమ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
ఇవీ చూడండి...