విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది.
నగరంలోని 10వ వార్డు తెదేపా అభ్యర్థి మద్దుల రామలక్ష్మి రాజశేఖర్... ఆదర్శనగర్, సెవెన్ బస్టాప్ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 22వ వార్డు పరిధిలో కళాభారతి తదితర కాలనీల్లో తెదేపా అభ్యర్థి బొట్ట వెంకటరమణ ప్రచారం నిర్వహించారు. 32వ వార్డు తెదేపా అభ్యర్థి పంపాన రాజ్యలక్ష్మి దోసెలు వేస్తూ ఓట్లను అభ్యర్థించారు. అల్లిపురం, జెండా చెట్టు ప్రాంతంలో పర్యటించారు. తెదేపా అధికారంలోకి వస్తేనే సామాన్యులకు సంక్షేమ పథకాలతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి అవకాశం కలుగుతుందని అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
17వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి భాను శ్రీ భోగిల వార్డు పరిధిలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేశారు. గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
నర్సీపట్నం మున్సిపాలిటీ
నర్సీపట్నం మున్సిపాలిటీలో వైకాపా విజయ కేతనం ఎగుర వేయటం ఖాయమని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. పట్టణంలోని 3 ,4 వార్డులలో అభ్యర్థులతో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నర్సీపట్నంలో రూ.14 కోట్లతో రహదారులు, డ్రైనేజీలు అభివృద్ధి చేశామన్నారు. పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చే పథకాలు ఎన్నో అమలు చేశామని ఎమ్మెల్యే గణేష్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి