విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు తెదేపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి.. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను చూసి తమ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 92వ వార్డు అభ్యర్థి మాధవి, 91వ వార్డు అభ్యర్థి అనూష తరఫున ఇంటింటికీ తిరిగి ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భారీగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'వైకాపా నాయకుల దౌర్జన్యాలకు నిరసనగా నామినేషన్లు దాఖలు చేయలేదు'