బీఎడ్‌లో ప్రవేశాల కోసం విశాఖలో కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు.. నానా అవస్థలు పడాల్సి వస్తోంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే కౌన్సెలింగ్‌కు మొదటి రోజు ఒకటో ర్యాంక్ నుంచి 4 వేల ర్యాంకు వరకు అభ్యర్థులను పిలిచారు. పరిశీలన జరిగే ఆంధ్రా విశ్వ విద్యాలయం టెక్నికల్ సెంటర్‌కు వివిధ జిల్లాలు నుంచి విద్యార్థులు వచ్చారు.
ఉదయం నుంచి రాత్రి వరకు.. కేవలం 800 మంది ధ్రువపత్రాలను మాత్రమే పరిశీలించారు. ఉదయం నుంచి ఎండ వేడి, సరైన సౌకర్యాలు లేకపోవడం, ఖచ్చితంగా సమాచారం లేని పరిస్థితుల్లో.. కౌన్సెలింగ్‌కు వచ్చిన గర్భిణులు, చంటి పిల్లల తల్లులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
ఇదీ చదవండి:
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపుపై కేంద్ర జలశక్తిశాఖ అధ్యయనం