వాల్తేరు రైల్వే డివిజన్ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ..తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ యూనియన్ విశాఖపట్నంలో ధర్నా చేసింది. అతి పురాతన డివిజన్లలో ఒకటైన వాల్తేర్ను ఎత్తివేయటమేంటని నాయకులు ప్రశ్నించారు. అనేక సార్లు నిరసనలు చేసినా..రైల్వే శాఖ స్పందించనందుకే ఈ మహా ధర్నా చేపట్టామని వెల్లడించారు. తమ డిమాండ్లను డీఆర్ఎం చేతన్ శ్రీవాస్తవకు లేఖ రూపంలో సమర్పించారు. అధికారులు తమ నిర్ణయాన్ని పునః సమీక్షించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి