కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా.. విశాఖ బీచ్ రోడ్లో అమరవీరుల స్మారక స్థూపం వద్ద యుద్ధంలో అమరులైన జవాన్లకు తూర్పు నౌకా దళం నివాళులర్పించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ప్రాజెక్ట్ వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయక్ ఇందులో పాల్గొని గౌరవ వందనాన్ని ఇచ్చారు. అనంతరం కొద్ది నిమిషాలు మౌనం పాటించి అంజలి ఘటించారు.
నావికులు.. అమరులైన వీర జవాన్ల స్మారకంగా సాయుధ వందనం సమర్పించారు. కార్గిల్ యుద్ధ విజయం స్ఫూర్తిదాయకంగా తీసుకుని.. 22వ కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నౌకాదళం అధికారులతో పాటు.. నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పాల్గొని అమరులకు నివాళులు అర్పించారు.
వీర సైనికులకు గౌరవ వందనం సమర్పిస్తున్నా
తెదేపా అధినేత చంద్రబాబు భారతీయులందరికీ కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆపరేషన్ విజయ్’ పేరిట పాక్ దురాక్రమణను తిప్పికొట్టి, భారత సైన్యం కార్గిల్ గడ్డపై విజయపతాకను ఎగరేసిన అద్భుత క్షణాలను గుర్తుచేసుకుంటున్నా. ఈ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు గౌరవ వందనం సమర్పిస్తున్నా." అని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:
FLOOD: గోదావరి నదికి పోటెత్తిన వరద.. నీటిలోనే లోతట్టు ప్రాంతాలు