భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో విశాఖలోని తూర్పు నౌకదళం విభాగం అప్రమత్తమైంది. పలు యుద్ధ నౌకలను అంతర్జాతీయ జలాల్లో వ్యూహత్మక ప్రాంతాల్లో మోహరించింది. గతంలో చైనా కు చెందిన యుద్ధ నౌక హిందూ మహ సముద్రంలో భారత్ కు వచ్చే మార్గంలో కవ్వింపు చర్యలకు దిగినప్పుడు తూర్పు నౌకదళ యుద్ధ నౌక దానిని వెంబడించింది. శత్రు దేశాల యుద్ధ నౌకల మోహరింపు, అప్రమత్తతను గుర్తించేందుకు ఇలా కవ్వింపులకు పాల్పడుతుంటాయి. ఇలాంటివి గతంలోనూ అనేక సార్లు జరిగాయి.
ఇదీ చదవండి: సింహాచల ఆలయ ట్రస్ట్ బోర్డ్ నుంచి ఒకరు తొలగింపు